: శశికళ లాంటి ఆడవాళ్లు ఎవరైనా ఉన్నారా? దాని మొహం చూస్తే కూడా అసహ్యమే!: ఆరుద్ర భార్య రామలక్ష్మి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు అన్నీఇన్నీ కావు.
‘అమ్మ’ జయలలిత నెచ్చెలి, ‘చిన్నమ్మ’ శశికళ ఆ పార్టీ అధినేత్రి కావాలని, సీఎం పీఠం దక్కించుకోవాలని వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. అయితే, జయలలిత మృతి విషయంలో శశికళపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ గురించి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య, రచయిత్రి రామలక్ష్మి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో రామలక్ష్మి మాట్లాడుతూ, ‘శశికళ లాంటి ఆడవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు.. మండోదరి... అట్లాంటిది కూడా కాదు. బి కాజ్ దే హావ్ క్లాస్. శశికళ .. అవుట్ అండ్ అవుట్ చీట్. ఆ రోజున పబ్లిక్ కంట్రోల్ చేయకపోతే చంపేసుందురు దాన్ని. పొయెస్ గార్డెన్ గేట్లో నుంచి ఆ రోజున ఈడ్చేశారు. పరిగెత్తింది లోపలికి. గవర్నర్ ను పైకి వెళ్లనీయలేదు. ఒక మనిషి మీద నువ్వు డబ్బు చేసుకో.. తీసుకున్నావు కదా! ఆమెను ఎందుకు చంపడం? జయలలిత చాలా ఆర్త్రైటిస్ పేషెంట్. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. జయలలితను మంచం మీద నుంచి శశికళ కిందకు లాగేస్తే కింద పడిపోయిందట. జయలలితను లేవదీసేందుకు బహు:శ ఆమె వంట మనిషి అనుకుంటా.. పెద్దావిడ వెళ్లబోతే ‘చంపేస్తా ముట్టుకుంటే’ అని శశికళ అందట! ఆ తర్వాతే జయలలితను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత జరిగిందంతా మిస్టరీ. జయలలితను దాదాపు చంపేశారు. దాని మొఖం చూస్తే కూడా అసహ్యం’ అని రామలక్ష్మి మండిపడ్డారు.

More Telugu News