pavan: సాఫ్ట్ గా .. మాస్ గా .. టూ షేడ్స్ లో కనిపించనున్న పవన్ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే అనిరుధ్ మ్యూజిక్ బిట్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో పవన్ ఒక కుర్చీని తిప్పుతూ కనబడతాడు. చూడటానికి సాధారణంగానే కనిపించినా, సినిమాలో ఇది హైలైట్ సీన్ అనేది తాజా సమాచారం.

 ఈ సినిమాలో పవన్ పాత్రలో టూ షేడ్స్ ఉంటాయట. శాంత స్వభావంతోను .. రఫ్ గాను ఆయన కనిపిస్తాడని అంటున్నారు. అజ్ఞాతం నుంచి బయటికి వచ్చిన ఆయన కసితో ఆ కుర్చీని తిప్పుతాడని చెబుతున్నారు. త్రివిక్రమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ పాత్ర, ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా .. క్లాప్స్ కొట్టించేలా ఉంటుందని అంటున్నారు. జనవరి 10వ తేదీన అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.       

More Telugu News