: ఇక అధికారిక పర్యటనలు ఆపండి... కేటీఆర్ సహా మంత్రులకు కేసీఆర్ ఆదేశాలు!

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పూర్తయ్యేవరకూ మంత్రులంతా అధికారిక పర్యటనలు మానుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమితుల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేస్తూ, 7న కేటీఆర్ నల్గొండ పర్యటనను రద్దు చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై కేటీఆర్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పార్టీ క్యాడర్ కు ఆయన రావడం లేదన్న సమాచారం అందింది.

 మరో వారంలోగా సమన్వయ సమితుల ఏర్పాటు 10,733 రెవెన్యూ గ్రామాల్లో పూర్తి కావాల్సి వుండగా, ఇప్పటివరకూ 25 శాతం సమితుల ఏర్పాటు కూడా పూర్తి కాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రామస్థాయిలో 15 మంది, మండల, జిల్లా స్థాయిలో 24 మంది చొప్పున, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులను తీసుకోవాల్సి వుంది. మొత్తం టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీల కార్యకర్తలుగా పేరు పడ్డ 1.60 లక్షల మందికి వీటిల్లో సభ్యులుగా అవకాశం దక్కనుంది. మండలాల్లో పెద్ద గ్రామాలుగా అనుకునే ప్రాంతాల్లో సభ్యుల ఎంపిక క్లిష్టంగా ఉన్నట్టు ఎమ్మెల్యేలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News