: మాంసం యాడ్ లో వినాయకుడిని చూపిన ఆస్ట్రేలియా కంపెనీ.. హిందువుల నిరసన!

ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి విడుదల చేసిన వ్యాపార ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. మీట్ అండ్ లైవ్ స్టాక్స్ ఆస్ట్రేలియా (ఎంఎల్ఏ) గొర్రె మాంసాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఓ వ్యాపార ప్రకటన తీయగా, అందులో హిందువులు పరమ పవిత్రంగా పూజించుకునే గణనాధుని చూపించారు. ఆపై ఏసుక్రీస్తు, బుద్ధుడినీ చూపారు. వీరంతా ఓ డైనింగ్ టేబుల్ పై చుట్టూ కూర్చుని మాంసం తింటున్నట్టు తెలిపారు. 'గొర్రెమాంసాన్ని మనమందరమూ తినొచ్చు' అని వారితో చెప్పించారు.

ఈ యాడ్ పై తీవ్ర విమర్శలు రాగా, ఆస్ట్రేలియాలోని హిందువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాపార ప్రకటన తొలుతగా 4వ తేదీన ప్రసారం అయినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ బ్యూరో 'ఎంఎల్ఏ'పై విచారణ ప్రారంభించిందని భారత అధికార వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఈ యాడ్ ను తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆస్ట్రేలియాలో హిందువుల ప్రతినిధి నితిన్ వశిష్ఠ్ డిమాండ్ చేశారు. వివాదంపై స్పందించిన ఎంఎల్ఏ గ్రూప్ మార్కెటింగ్ మేనేజర్ ఆండ్ర్యూ హౌవీ, తామేమీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని, యాడ్ ను ఉపసంహరించ బోమని స్పష్టం చేయడం గమనార్హం.

More Telugu News