: ఫలించిన తెలంగాణ ప్రభుత్వ కృషి.. రెండు జాతీయ రహదార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది. రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంజూరైన రహదారులు వరంగల్ రంగశాయిపేట నుంచి చింతనెక్కొండ, నెక్కొండ, కేసముద్రం మీదుగా మహబూబాబాద్ వరకు మొత్తం 71 కిలోమీటర్లు. రెండోది భూపాలపల్లి నుంచి అన్షాస్ పల్లి, గోర్లవీడు, నేరేడుమిల్లి తండా, గరిమిళ్లపల్లి, బూరపల్లి, ఎంపేడు, వావిలాల, జమ్మికుంట, వీణవంక మీదుగా కరీంనగర్ వరకు మొత్తం 130 కిలోమీటర్లు. దీంతోపాటు ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లైన్ల రోడ్ల అభివృద్ధికి రూ. 290 కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. మొత్తం మీద రెండు జాతీయ రహదారులను రూ. 690 కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

More Telugu News