: బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన భాగ్యనగరం!

బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు హైదరాబాదు సిద్ధమైంది. గణేష్ ఉత్సవ కమిటీ, తెలంగాణ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభంకానుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతిసారీ ఆలస్యంగా జరిగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఈ ఏడాది మధ్యాహ్నానికల్లా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు ప్రారంభించారు.

నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ వివిధ చర్యలు చేపట్టింది. హైదరాబాదు చుట్టూ ఉన్న చెరువులు, కుంటల్లో కూడా నిమజ్జనం చేయొచ్చని తెలిపింది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతాఏర్పాట్లు చేపట్టింది. ఏవైనా సమస్యలుంటే 100 నెంబర్ కు డయల్ చేయవచ్చని సూచించింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 27 క్రేన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తోంది. నేటి సాయంత్రానికి గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. 

More Telugu News