చిరూ కోసం భారీ సెట్టింగ్స్

04-09-2017 Mon 09:20
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక వైపున నటీనటుల ఎంపికను పూర్తి చేస్తూనే, ఈ సినిమాకి సంబంధించిన సెట్టింగ్స్ పై దృష్టి పెట్టారు. భారీ సెట్టింగ్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ రంగంలోకి దిగారు. 1840 సమయంలో గల సామాజిక వాతావరణం ఎలా వుండేదోననే విషయంలో కొన్ని ఆధారాలను సేకరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

 ఆ కాలానికి చెందినటువంటివిగా అనిపించే భారీ సెట్టింగ్స్ ను వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. స్కెచెస్ ను సిద్ధం చేసే పనిలో 15 మంది టీమ్ ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ .. రాజస్థాన్ .. పొల్లాచ్చిలలో ఈ సెట్టింగ్స్ వేయాలనే నిర్ణయానికి వచ్చామని అన్నారు. ఈ సినిమా తప్పకుండా ఒక అద్భుతమైన విజువల్ వండర్ అవుతుందనే నమ్మకం తనకి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.