: నోట్ల రద్దుపై నేనప్పుడే హెచ్చరించా.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు

గతేడాది మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐ డు వాట్ ఐ డు: ఆన్ రీఫార్మ్స్, రెటోరిక్ అండ్ రీసాల్వ్‘ పేరుతో రాసిన పుస్తకంలో రాజన్ పలు విషయాలను ప్రస్తావించారు. వచ్చే వారం ఈ పుస్తకం విడుదల కానుంది. నోట్ల రద్దుపై ఫిబ్రవరి 2016లోనే ప్రభుత్వం తన అభిప్రాయం అడిగిందని పేర్కొన్న రాజన్.. పెద్ద నోట్లు రద్దు చేస్తే భవిష్యత్తులో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని హెచ్చరించినట్టు తెలిపారు. అయితే ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను వివరించినట్టు పేర్కొన్నారు.

నోట్ల రద్దు వల్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు కొంతవరకు మేలుచేస్తుందని రాజన్ పేర్కొన్నారు. నోట్ల రద్దు ఉద్దేశం మంచిదే అయినా ఆర్థికంగా విజయం సాధించిందని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదన్నారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. నోట్ల రద్దు తర్వాత వెనక్కొచ్చిన 99 శాతం నగదు డిపాజిట్‌పై దర్యాప్తు చేయించగలిగితే నల్లధనం బయటపడే అవకాశం ఉందన్నారు. మొండి బకాయిల ప్రక్షాళన వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టిందనడం సరికాదని రఘురాం రాజన్ పేర్కొన్నారు.


 

More Telugu News