varun tej: పవన్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో వరుణ్ తేజ్ మూవీ?

'ఫిదా' సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమా షూటింగులో బిజీ అయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను నిర్ణయించలేదు.

గతంలో పవన్ కి సూపర్ హిట్ ను తెచ్చిపెట్టిన 'తొలి ప్రేమ' టైటిల్ ను ఈ సినిమాకి పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. పవన్ కెరియర్లో 'తొలి ప్రేమ' ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ మూవీ కూడా ప్రేమ కథాంశంతో కూడినది కావడంతో ఈ టైటిల్ ను సెట్  చేయనున్నారట. ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడం జరిగిందని అంటున్నారు. అదే నిజమైతే .. ఈ సినిమాకి టైటిల్ ప్రధానమైన ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.     

More Telugu News