: ట్రంప్ కాన్వాయ్ కు తప్పిన పెను ప్రమాదం.. భయాందోళనలకు గురైన సెక్యూరిటీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ వస్తున్న సమయంలో, పక్కనున్న చెట్ల పొదల్లో నుంచి హఠాత్తుగా వచ్చిన ఓ కారు... ట్రంప్ కాన్వాయ్ ను ఢీకొనబోయి, రోడ్డుపై ఆగిపోయింది. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అమెరికాలోని మిస్సోరి పర్యటనకు వెళ్లిన ట్రంప్... విమానాశ్రయం నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే, కారు బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, ఘటన జరిగిన సమయంలో వీడియో తీసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం విభిన్నమైన కథనాన్ని వినిపిస్తున్నాడు. కావాలనే ఆ కారు ట్రంప్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చిందని ఆయన తెలిపాడు. ఆ కారులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టుగా కనిపించిందని చెప్పాడు.

More Telugu News