: అమ్మాయిలంటే అంత గౌరవం మరి... 51 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై నేరాలు చేసినవారే!

ఇండియాలోని పార్లమెంట్ సహా, అన్ని రాష్టాల అసెంబ్లీల్లోని ప్రజా ప్రతినిధుల్లో 51 మంది మహిళలపై నేరాలు చేసినవారేనని ఏడీఆర్ అనాలిసిస్ వెల్లడించింది. ప్రజాప్రతినిధులు వెల్లడించిన సెల్ఫ్ డిక్లేర్డ్ అఫిడవిట్ లను పరిశీలించి అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియాలో 776 మంది ఎంపీలుండగా, 774 మంది అఫిడవిట్లను... 4,120 మంది ఎమ్మెల్యేలుండగా, 4,078 మంది అఫిడవిట్లను పరిశీలించగా, ముగ్గురు ఎంపీలు, 48 మంది ఎంఎల్ఏలు అమ్మాయిల పట్ల నేరాలు చేశారని, వీరిలో నలుగురిపై అత్యాచారం కేసులు ఉన్నాయని పేర్కొంది.

ఈ కేసులన్నీ విచారణ దశలో ఉన్నాయని తెలిపింది. మొత్తం 1,581 మంది నేరచరిత్రను కలిగివున్నవారేనని తెలిపింది. వీటిల్లో 334 మంది మహిళలపై నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంలో బీజేపీ ముందు నిలిచి 14 మంది మహిళలపై నేరాలు చేసిన ప్రజా ప్రతినిధులను కలిగివుండగా, ఆపై స్థానాల్లో శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయని వెల్లడించింది.

More Telugu News