: నంద్యాల ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఇక చేయండి: వైకాపా డిమాండ్

నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తక్షణం నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి, తమను చూస్తుంటే తెలుగుదేశం నేతలకు భయమని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతోనే కుప్పలు తెప్పలుగా హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టారని, తమకు ఓట్లు వేయకుంటే అభివృద్ధి ఆగుతుందని ప్రచారం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

నంద్యాలలో గెలుపుకోసం రూ. 200 కోట్లను అధికార పార్టీ ఖర్చు చేసిందని విమర్శించారు. అయినా తమకు 70 వేల ఓట్లు వచ్చాయని, తమకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే చూస్తూ ఊరుకోబోమని, తక్షణం 13 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. టీడీపీకి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 

More Telugu News