allari naresh: ఆకట్టుకుంటోన్న 'మేడ మీద అబ్బాయి' ట్రైలర్!

అల్లరి నరేశ్ కథానాయకుడిగా 'మేడ మీద అబ్బాయి' సినిమా రూపొందింది. మలయాళ మూవీ 'ఒరు వడక్కన్ సెల్ఫీ' సినిమాకి ఇది రీమేక్. 2015 లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్కడి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన ప్రజీత్ .. తెలుగులోను ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 ఈ సినిమా ద్వారా నిఖిలా విమల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అల్లరి నరేశ్ వున్నాడు. 

More Telugu News