: భార‌త్‌కు చేరుకున్న అమెరికా ఉభయచర యుద్ధనౌక

అత్యవసర పరిస్థితులు ఏర్ప‌డితే ఎదుర్కోవడానికి, మిత్రపక్షాలతో భాగస్వామ్యాలను వృద్ధి చేసుకోవడానికి అమెరికా త‌మ   ఉభయచర యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ పెరల్‌ హార్బర్ ను తొలిసారిగా భార‌త్‌కు పంపించింది. భార‌త్‌, అమెరికా నడుమ రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆ యుద్ధ‌నౌక‌ను గోవాలో ఉంచారు. 700 మందికిపైగా నావికులు, మెరైన్ కమాండోలు ఉండే ఈ యుద్ధ‌నౌక 1998లో అమెరికా నేవీలో చేరింది. ఈ యుద్ధ‌నౌక భార‌త్‌కు చేరుకున్న నేప‌థ్యంలో పెరల్‌ హార్బర్‌ కమాండింగ్‌ అధికారి థియోడర్‌ ఎసెన్‌ఫెల్డ్ మాట్లాడుతూ.. భారత్‌ను సందర్శించే అవకాశం లభించడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.     

More Telugu News