: మరోసారి పాక్‌ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన చైనా

ఉగ్ర‌వాదాన్ని ప్రోత్సహిస్తోంద‌ని పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో చైనా మ‌రోసారి త‌మ మిత్ర‌దేశ‌మైన పాక్‌ను స‌మ‌ర్థించింది. ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ఆందోళనలను అమెరికా గౌరవించాలని వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జిచి అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆప్ఘనిస్థాన్‌ పరిణామాల్లో పాకిస్థాన్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తుంద‌ని యాంగ్‌ జిచి చెప్పారు. అంతేగాక‌, ఉగ్రవాదంపై పోరు విషయంలో పాక్‌ రాజీలేని పోరు కొనసాగిస్తున్నదని చైనా చెప్పుకొచ్చింది.   

More Telugu News