బన్నీ అంటే ఇష్టం .. ఎన్టీఆర్ తో చేయాలనుంది : శ్రద్ధా దాస్

తెలుగు తెరకి తనదైన గ్లామర్ టచ్ ఇచ్చిన కథానాయికలలో శ్రద్ధా దాస్ ఒకరు. తెలుగుతో పాటు ఆమె ఏ చిత్ర పరిశ్రమ నుంచి అవకాశం వచ్చినా, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోల్లో ఎవరంటే ఇష్టమనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. తెలుగులో తాను ఎక్కువగా ఇష్టపడే హీరో అల్లు అర్జున్ అని ఆమె చెప్పింది. 'ఆర్య 2'లో తనకి ఆయన అవకాశం ఇచ్చారనీ, ఆ సినిమా తనకి ఎంతో పేరు తీసుకొచ్చిందని అంది.

 ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే కోరిక చాలా కాలంగా ఉందని చెప్పింది. ఆ కల నెరవేరే సమయం కోసం ఎదురుచూస్తున్నానని అంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'బిగ్ బాస్'లో తనకి అవకాశం వచ్చిందనీ, అయితే కొన్ని కమిట్మెంట్స్ కారణంగా తాను అంగీకరించలేకపోయానని చెప్పుకొచ్చింది.    
Go Back to Shorts
allu arjun
shraddha das

More Telugu News