: హైదరాబాద్ మసాజ్ సెంటర్లలో ఆసాంఘిక కార్యకలాపాలు... పలువురి అరెస్ట్!

హైదరాబాద్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మసాజ్ సెంటర్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. గత రాత్రి మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మసాజ్ పార్లర్లపై ఏక కాలంలో దాడులు నిర్వహించగా, పలువురు యువతీ, యువకులు శృంగార కార్యకలాపాల్లో మునిగితేలుతూ పట్టుబడ్డారు. వీరిలో పలువురు విదేశీ యువతులు ఉండటం గమనార్హం. అరెస్ట్ చేసిన వారిని సంబంధిత ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించామని, మసాజ్ కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News