ajith: అజిత్ యాక్షన్ మూవీస్ లో 'వివేగం' హైలైట్ అవుతుందట!

కెరియర్ తొలినాళ్లలో రొమాంటిక్ హీరోగా యూత్ మనసులు దోచేసిన అజిత్, ఈ మధ్య మాస్ ఆడియన్స్ మనసుకు నచ్చే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. వీర ... వేదాళం సినిమాలతో తనకి వరుస హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో ఆయన 'వివేగం' సినిమా చేశాడు. కాజల్ .. అక్షర హాసన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, నవీన్ శొంఠినేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు.

 యు/ఎ సర్టిఫికెట్ ను పొందిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదలవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో, అజిత్ చేసే ఫైట్స్ చూసితీరవలసిందేనని అంటున్నారు. అజిత్ ఇంతవరకూ చేసిన యాక్షన్ మూవీస్ లో ఈ సినిమా హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఒక కొత్త అజిత్ ను ఈ సినిమాలో చూస్తారంటూ ఆసక్తిని .. అంచనాలను పెంచేస్తున్నారు.   

More Telugu News