: త్వ‌ర‌లో తెలంగాణ భాష నిఘంటువు... శ్రీకారం చుడుతున్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల‌యం

తెలంగాణ భాష‌లో ఉన్న ప‌దాల గురించి చాలా మందికి తెలియ‌దు. సాధార‌ణంగా ఉప‌యోగించే పదాలు కాకుండా తెలంగాణ యాస‌కే ప్ర‌త్యేకంగా ఉన్న కొన్ని ప‌దాలు ఎలాంటి పుస్త‌క‌రూపం లేక‌పోవ‌డంతో క‌నుమ‌రుగ‌వుతున్నాయి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల‌యం తెలంగాణ ప్ర‌జ‌ల భాష‌, యాస‌ను కాపాడ‌టానికి ల‌క్ష ప‌దాల‌తో నిఘంటువు త‌యారీకి శ్రీకారం చుడుతున్నారు.

ఇందులో భాగంగా అరుదైన పదాలన్నింటినీ సేకరించేందుకు అమరేశం రాజేశ్వరశర్మ, కట్టా శేఖర్‌రెడ్డి, రవ్వా శ్రీహరి, గంటా చక్రపాణి, డాక్టర్‌ నలిమెల భాస్కర్‌లతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఆయా ప్రాంతాల్లోని భాషా నిపుణులు, రచయితలు, పత్రికా సంపాదకులతో సమావేశమై వారి సూచనలు సలహాలు తీసుకోనుంది. దీనికి సంబంధించి ఆగస్టు 28వతేదీ ఉదయం 11 గంటలకు వర్సిటీ ప్రాంగణంలో తొలి సమావేశం నిర్వహించనున్నారు.

More Telugu News