: ప్రభావం చూపని బీజేపీ... పశ్చిమ బెంగాల్ లో స్థానిక ఎన్నికల్లో తృణమూల్ క్లీన్ స్వీప్!

పశ్చిమ బెంగాల్ లోని ఏడు యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీస్)లకు జరిగిన ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది. ఆగస్టు 13న ఎన్నికలు జరుగగా, ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ధూప్ గురి మునిసిప్ లో 16 వార్డులుండగా, 12 వార్డుల్లో తృణమూల్ గెలిచింది. పున్ష్ కురా మునిసిపాలిటీలో 18 వార్డులుండగా, 10 వార్డులను తృణమూల్ గెలుచుకుంది. మిగతా వార్డుల కౌంటింగ్ కొనసాగుతోంది. హల్దియా మునిసిపాలిటీలో 29 వార్డులుండగా, తృణమూల్ ఇప్పటికే 17 వార్డుల్లో గెలిచి మెజారిటీ సాధించింది.

నల్ హాతీ మునిసిపాలిటీలో 16 వార్డులుండగా, టీఎంసీ 14 వార్డుల్లో విజయం సాధించింది. బునియాద్ పూర్ లో 14 వార్డులుండగా, అధికార టీఎంసీ 13 వార్డులను గెలుచుకుంది. నోటిపైడ్ ఏరియాగా ఉన్న కూపర్స్ క్యాంప్ లోని 12 వార్డులనూ తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇదే సమయంలో ఖాళీగా ఉన్న కొన్ని పురపాలికల్లోని వార్డులకు ఎన్నికలు జరుగగా, అన్నింటిలో తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా ప్రభావం చూపకపోవడం గమనార్హం.

More Telugu News