: అబ్బాయిని కనాలని లేదు, కానీ, అమ్మాయికి జన్మనివ్వాలంటే భయంగా ఉంది: బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి

స్వాతంత్ర్య దినోత్సవం నాడే పంజాబ్ రాజధాని చండీగఢ్ లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో జెండా వందనానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న బాలికపై  ఈ దారుణం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళల భద్రతను ఉద్దేశించి హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి స్పందించింది. జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.

 ‘‘భేటీ బచావో’ కార్యక్రమం ఏమైంది?. నాకు కుమారుడికి జన్మనివ్వాలని లేదు కానీ, ఈ పరిస్థితుల్లో అమ్మాయిని కనాలంటే మాత్రం భయంగా ఉంది. ‘స్వర్గం నుంచి నరకానికి ఎందుకు తీసుకొచ్చావు?’ అని రేపు ఒకవేళ మా అమ్మాయి నన్ను అడిగితే ఏం చెప్పను? క్రూరమైన నేరాలు చేసే వారిని ఎందుకు తీవ్రంగా శిక్షించరు? మళ్లీ అత్యాచారం! మనం ఏ స్వతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం? దేశానికి మహిళలు ముఖ్యం కాదు అనుకునే రాజకీయ పార్టీలకు మహిళలు ఇకపై ఓట్లు వేయడాన్ని ఆపాలి... అసలు, మేము ఎందుకు ఓటు వేయాలి?... అన్ని పార్టీలు ఇప్పుడు నిద్రలేవాలి, ప్రతి మహిళ హక్కు భద్రత’ అని అన్నారు.

More Telugu News