ntr: ఎన్టీఆర్ 'లవ' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!

'జై లవకుశ' సినిమా నుంచి వచ్చిన 'జై' పోస్టర్ కి .. టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో ఇటీవలే ఈ సినిమా నుంచి 'లవ' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అభిమానులంతా ఈ పాత్రకి సంబంధించిన టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి 'లవ' టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే 'కుశ' పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. 'లవ' టీజర్ తో .. 'కుశ' ఫస్టులుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడం ఖాయమన్న మాట. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, ముగ్గురు కథానాయికలు కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే.     

More Telugu News