: చందు వరకు వెళ్లడంలో విఫలమైన రోబోటిక్ హ్యాండ్!

గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరంలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ చేపట్టిన సహాయక చర్యల్లో అంతరాయం ఏర్పడింది. రోబోటిక్ హ్యాండ్ తో చందును బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు ప్రయత్నించగా, కొంత లోతుకు వెళ్లిన తరువాత రాయి అడ్డం వచ్చింది. దీంతో రోబోటిక్ హ్యాండ్ బాబును తీసే ప్రయత్నంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించి దాని నుంచి విరమించుకున్నారు. దీంతో సమాంతరంగా తవ్విన గోతినే మరింత పెద్దది చేసుకుంటూ చందూను చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, జిల్లా అధికార యంత్రాంగంతోపాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర టీడీపీ, వైెఎస్సార్సీపీకి చెందిన నేతలు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. 

More Telugu News