dulquer salman: బాలీవుడ్ కి వెళుతోన్న దుల్కర్ సల్మాన్

మలయాళంలోని యువ కథానాయకులలో దుల్కర్ సల్మాన్ కి విపరీతమైన క్రేజ్ వుంది. మాస్ ను .. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ, కెరియర్ పరంగా ఆయన దూసుకెళుతున్నాడు. 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన, ప్రస్తుతం 'మహానటి' సినిమాలో సావిత్రి భర్త పాత్రను పోషిస్తున్నాడు.

 త్వరలో ఆయన బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. రోన్ని స్క్రూవాలా నిర్మాణంలో .. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువభాగం షూటింగ్ కేరళలోనే జరగనుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తన తాజా చిత్రం 'సోలో' పైనే దృష్టి పెట్టాడు. మలయాళ .. తమిళ భాషల్లో త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది. 
dulquer salman

More Telugu News