: చంద్రబాబును కాలర్ పట్టుకుని నిలదీయండి: జగన్
గత మూడున్నర ఏళ్లలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకులెవరూ నంద్యాలవైపు చూడలేదని... ఇప్పుడు ఎన్నికలు రావడంతో, వారంతా నంద్యాలపై వాలిపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఒంటివెలగలలో రోడ్ షో సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలని... పేదలకు ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని విమర్శించారు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే... ఇచ్చిన మాటను తప్పితే కాలర్ పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఉప ఎన్నిక వస్తుందని తెలియనంత వరకు చంద్రబాబు కానీ, మంత్రులు కానీ ఏనాడైనా నంద్యాలకు వచ్చారా? అని జగన్ ప్రశ్నించారు. ఉప ఎన్నిక వచ్చేసరికి చంద్రబాబు బెంబేలెత్తిపోయారని... హడావుడిగా జీవోల మీద జీవోలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలపై ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రత్యేక ప్రేమ లేదని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ పోటీకి వచ్చింది కాబట్టే ఇక్కడ చంద్రబాబు కనిపిస్తున్నారని చెప్పారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తన కోసం వచ్చి ప్రేమను, ఆప్యాయతను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు వస్తే... ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కాలర్ పట్టుకుని నిలదీయండని పిలుపునిచ్చారు.