Ritu sharwanand: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  'పెళ్లిచూపులు', 'కేశవ' సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్న కథానాయిక రీతువర్మ త్వరలో తెలుగులో ఓ రొమాంటిక్ ఫిలిం చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆమె చెప్పింది. కాగా,  తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రం హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రంలో రీతూ వర్మ నటిస్తోంది.
*  శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానుభావుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచిలో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.
*  రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'రోబో 2' చిత్రం తెలుగు అనువాద హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఏపీ, తెలంగాణ ప్రదర్శన హక్కులను గ్లోబల్ సినిమా ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.   

More Telugu News