akhil: 'లై' హిట్ అయితే తదుపరి సినిమా అఖిల్ తోనే!: హను రాఘవపూడి

కథా వస్తువు ఏదైనా దానిని తెరపై చక్కగా ఆవిష్కరించగలిగే దర్శకుడిగా హను రాఘవపూడికి పేరుంది. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి యువ హీరోలంతా ఎంతో ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి హను రాఘవపూడి తాజా చిత్రంగా రేపు 'లై' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం తన నెక్స్ట్ మూవీ అఖిల్ తోనే వుండే ఛాన్స్ ఉందని హను రాఘవపూడి చెప్పాడు.

 ఇంతకుముందు అఖిల్ కి హను రాఘవపూడి ఒక కథ చెప్పాడు. అది అఖిల్ కి బాగా నచ్చేసింది కూడా. అయితే కొన్ని కారణాల వలన ముందుగా విక్రమ్ కుమార్ తో అఖిల్ చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో నితిన్ తో హను రాఘవపూడి చేసిన కథ .. అఖిల్ కి వినిపించినదే అనే టాక్ వచ్చింది. అందులో నిజం లేదని హను క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ కి నచ్చిన కథ తన దగ్గర భద్రంగా ఉందనీ .. 'లై' హిట్ అయితే అఖిల్ తోనే సెట్స్ పైకి వెళ్లొచ్చని చెప్పుకొచ్చాడు.  
akhil
hanu raghavapoodi

More Telugu News