: అవకాశం కావాలంటే కోరిక తీర్చాలన్న పూణే దర్శకుడు... పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ కోసం వెళ్లిన యువతిని కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానని దర్శకుడు డిమాండ్ చేసిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఓ అమ్మాయి పూణేలోని ఒక ప్రముఖ కళాశాలలో చదువుకుంటోంది. సెలవుల నేపథ్యంలో ఇంటికి చేరుకున్న యువతికి తాము కొత్తగా నిర్మించనున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని వాట్స్ యాప్ మెసేజ్ వచ్చింది.
దీంతో మళ్లీ పూణే చేరుకున్న యువతి కాలేవాడిలో తప్కీర్ చౌక్ లో వాట్స్ యాప్ లో సూచించిన అడ్రస్ కు చేరుకుంది. అయితే ఆమెకు ఆడిషన్ నిర్వహించాల్సిన దర్శకుడు అప్పా పవార్.. ఆడిషన్ చేయకుండానే తనతో గడిపితే సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. దీంతో భయపడ్డ యువతి, వెంటనే తిరిగి ఇంటికి చేరుకుంది. బాగా ఆలోచించి రెండు రోజుల తరువాత అతనిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్శకుడు అప్పా పవార్ కోసం గాలింపు చేపట్టారు.