: అమెరికా ప్రజలారా! హాయిగా నిద్రపోండి..యుద్ధం గురించి ఆందోళన వద్దు: అమెరికా సీఎస్

అమెరికా ప్రజలు యుద్ధం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ రాత్రి హాయిగా నిద్రపోవచ్చని ఆ దేశ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ భరోసా ఇచ్చారు. అమెరికాలోని గువాం దీవిపై దాడి చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆరువేల మంది సైనికులు పహారా కాస్తున్నారని ఆయన తెలిపారు. తమ అధీనంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పించడం అమెరికా బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఉద్రిక్తతలు తొలగించుకునేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడితో తమ అధినేత ట్రంప్ మాట్లాడాలనుకున్నారని, కానీ ప్రస్తుతం పరిస్థితులు చేయిదాటిపోయాయని, అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలిపారు. యుద్ధం గురించి అమెరికన్లు భయపడాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News