: రన్ వే పై రెండు విమానాలు ఢీ... తెగిపడిన విమానాల రెక్కలు!

కెనడాలోని టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకున్నాయి. దీంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు భారీ కుదుపుకు లోనయ్యారు. ఏం జరిగిందో తెలియక బెంబేలెత్తిపోయారు. తరువాత రెండు విమానాలు ఢీకొట్టాయని, ఈ ఘటనలో రెండు విమానాల రెక్కలు తెగిపడ్డాయని తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

 కాగా, పోలాండ్‌ కు చెందిన బోయింగ్‌ 787 విమానం టేకాఫ్‌ కు సిద్ధమవుతుండగా, అప్పటికే ల్యాండ్ అయిన కెనడా కు చెందిన ఎయిర్‌ కెనడా విమానం పార్కింగ్ కు ముందుకు వస్తోంది. ఈ క్రమంలో ఢీకొన్నాయి. ఈ సమయంలో ఒక్కో విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నట్టు విమానాశ్రయాధికారులు తెలిపారు. ఏదైనా జరగరానిది జరిగితే 400 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవని వారు తెలిపారు.  

More Telugu News