: భారత్ లో చమురు బావి, మసీదు నిర్మిస్తాం: ముందుకొచ్చిన దుబాయ్ ప్రభుత్వం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ ప్రభుత్వం భారత్ కు స్నేహహస్తం చాచింది. 2017ను దాతృత్వ సంవత్సరంగా ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం వివిధ దేశాల్లో చమురు బావులు అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ రెడ్ క్రీసెంట్ అనే కంపెనీతో కలిసి దుబాయ్ ప్రభుత్వం భారత్, మాలి దేశాల్లో రెండు చమురు బావులను అభివృద్ధి చేస్తామని తెలిపింది.

అలాగే భారత్, సోమాలియా, బుర్కిన్ ఫోసా, మాలి, మార్టినేషియా దేశాల్లో 800 మంది సామర్థ్యం కలిగిన మసీదులను నిర్మిస్తామని తెలిపింది. ఎమిరేట్స్ రెడ్ క్రీసెంట్ అనే సంస్థ సిబ్బంది విరాళాలతో ఈ పనులు చేపడుతున్నట్టు దుబాయ్ తెలిపింది. 

More Telugu News