: సరిహద్దుల్లో 8 నెలల్లోగా అంగుళం కూడా వదలకుండా స్మార్ట్ ఫెన్స్!

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో అంగుళం కూడా వదలకుండా మార్చి 2018 నాటికి స్మార్ట్ ఫెన్స్ ను ఏర్పాటు చేయడాన్ని తదుపరి తక్షణ లక్ష్యంగా భావించి, పనులు పూర్తి చేయనున్నామని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ వెల్లడించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యంగా జమ్మూ సెక్టార్ లో సరిహద్దుల మూసివేత పనులను చేపట్టాల్సి వుందని అన్నారు. బంగ్లాదేశ్ వైపు పెద్దగా ప్రమాదమేమీ లేదని, పాక్ సరిహద్దులే కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, ఈ ప్రాంతం నుంచి ఎవరు చొరబడినా, భారత్ కు ప్రమాదమేనని అభిప్రాయపడ్డారు.

ఈ సంవత్సరం అక్టోబర్ లో అమరులైన బీఎస్ఎఫ్ జవాన్ల కోసం హాఫ్ మారథాన్ ను నిర్వహించనున్నామని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట స్మార్ట్ ఫెన్స్ ఏర్పాటు పనులు సాగుతున్నాయని, జమ్మూ సెక్టార్ వరకూ పనులు మరో ఎనిమిది నెలల్లో పూర్తవుతాయని అన్నారు. భారత్, బంగ్లా సరిహద్దుగా ఉన్న సుమారు 4,096 కిలోమీటర్ల పొడవునా ఇదే తరహా ఫెన్సింగ్ ఉంటుందా? అన్న ప్రశ్నకు తాము ప్రాధాన్యతాపూర్వకంగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

More Telugu News