: రెండు రోజుల్లో ఆల్మట్టి, మూడు రోజుల్లో జూరాల నిండుకుండలే!

ఎగువ కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి జలాశయానికి వస్తున్న వరద నీరు మరింతగా పెరిగింది. రెండు రోజుల క్రితం 1.20 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం, ఈ ఉదయం 1,42,953 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 129 టీఎంసీల నీటి సామర్థ్యమున్న డ్యామ్ లో ఇప్పటికే సుమారు 100 టీఎంసీల నీరు చేరుకుంది. మరో రెండు రోజులు ఇదే వరద నిండితే, ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయికి చేరుతుంది.

ఆపై వచ్చే నీటిని కిందకు వదిలితే, ఒక్క రోజులోనే జూరాల నిండి శ్రీశైలానికి కృష్ణమ్మ ఉరుకులు పెడుతుంది. జూరాల సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.70 టీఎంసీల నీరుంది. ఇక శ్రీశైలం మాత్రం అడుగంటిన స్థితిలోనే కనిపిస్తోంది. 215 టీఎంసీలల నీటి నిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయంలో కనీసం 20 టీఎంసీల నీరు కూడా లేదు. నాగార్జున సాగర్ లో సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఇక నారాయణపూర్ విషయానికి వస్తే 37 టీఎంసీల సామర్థ్యముండగా, 33 టీఎంసీల నీటితో సంతృప్తికర స్థాయిలో ఉంది.

More Telugu News