: ఆరంభంలోనే ఇన్వెస్టర్లలో ఆనందాన్ని నింపిన సెన్సెక్స్, నిఫ్టీ

అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ ను అభిశంసించే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలు రాజకీయ అనిశ్చితిని పెంచుతున్న వేళ, డాలర్ విలువ ఏడాది కనిష్ఠానికి పడిపోవడం, బంగారం ధర నాలుగు వారాల గరిష్ఠానికి చేరడం వంటి పరిణామాలు, ఇన్వెస్టర్లను ఈక్విటీ మార్కెట్ల వైపు నడిపించగా, వారాంతం తరువాత నేటి ఉదయం సెషన్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైం రికార్డు స్థాయులను నమోదు చేసి మదుపుదారుల్లో ఆనందాన్ని పెంచాయి.

ఈ ఉదయం 10.40 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 182 పాయింట్లు పెరిగి 0.57 శాతం లాభంతో 32,211 పాయింట్లు లాభపడింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 47 పాయింట్ల వృద్ధితో 0.48 శాతం లాభపడి 9,962 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ స్థాయిని సెన్సెక్స్, నిఫ్టీలు నమోదు చేయడం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.64.43 వద్ద నడుస్తోంది.

More Telugu News