: ప‌నిపై ప్రేమ ఉంటే కుర్చీలు బిగించినా త‌ప్పు లేదంటున్న సీఈఓ!

`ఉద్యోగం చిన్న‌దా? పెద్ద‌దా? అని కాదు, దాన్ని ఎంత ప్రేమ‌తో చేశామ‌నేదే ముఖ్యం. చేసే ప‌నిపై ప్రేమ ఉంటే కుర్చీలు బిగించినా త‌ప్పు లేదు` అంటున్నారు మెషీన్ లెర్నింగ్ టెక్నాల‌జీ సంస్థ రాబిన్ వ్య‌వ‌స్థాప‌కుడు పునీత్ సోనీ. ఫ్లిప్‌కార్ట్‌లో గ‌తేడాది త‌న ఉద్యోగం వ‌దులుకుని `రాబిన్` కంపెనీని స్థాపించిన ఆయ‌న స్టార్ట‌ప్ కంపెనీల‌ను ఎలా నిర్వ‌హించాల‌నే విష‌యంపై త‌న ఉద్యోగుల‌కు ఫేస్‌బుక్ ద్వారా బోధించారు. త‌న కంపెనీ ప్రారంభ ద‌శ‌ల్లో స‌మావేశం కోసం ఇంకో ఉద్యోగితో క‌లిసి కుర్చీలు బిగిస్తున్న ఫొటోను ఈ సంద‌ర్భంగా ఆయ‌న షేర్ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా, గూగుల్ వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ప‌నిచేసిన పునీత్ సోనీ సొంతంగా ఒక సంస్థ‌ను నెల‌కొల్పడం వ‌ల్ల పొందే ఆనందాన్ని అంద‌రితో పంచుకున్నారు. ప‌ని మీద ఉన్న ప్రేమే తాను నెల‌కొల్పిన స్టార్ట‌ప్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

More Telugu News