శ్రుతిహాసన్ కి ఖుష్బూ కౌంటర్ ఇచ్చేసింది!

18-07-2017 Tue 16:26
తమిళంలో 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో .. సుందర్ సి దర్శకత్వంలో 'సంఘమిత్ర' అనే సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం శ్రుతి హాసన్ ను తీసుకోవడం ..  ఆ తరువాత ఆమె తప్పుకోవడం జరిగిపోయాయి. ఆ సమయంలో స్క్రిప్ట్ రెడీ కాలేదనీ .. ప్లానింగ్ సరిగ్గా లేదని ఆమె కామెంట్స్ చేసింది. ఆ విషయంపై కాస్త ఆలస్యంగా .. సుందర్ భార్యగా ఖుష్బూ స్పందించింది.

 'సంఘమిత్ర' ప్రాజెక్టుపై కొందరు చేసిన కామెంట్లు తన దృష్టికి వచ్చాయని చెప్పింది. తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరులను నిందించడం కరెక్ట్ కాదని ఖుష్బూ అంది. వారసత్వాన్ని కొనసాగించే వాళ్లు మరింత ప్రొఫెషనల్ గా ఉండాల్సిన అవసరం వుందని చెప్పింది. తప్పులను అంగీకరించడం మొదలుపెట్టినవారే .. మంచి స్థాయికి వెళతారని అంది.