: నటి శ్రీదేవి విజయకుమార్ కూతురు బర్త్ డే వేడుక.. హాజరైన సినీనటులు!

దక్షిణాది నటి శ్రీదేవి విజయకుమార్  కూతురు రూపిక మొదటి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో శ్రీదేవి కుటుంబసభ్యులు, తమిళ, తెలుగు సినీ రంగాలకు చెందిన పలువురు సినీనటులు హాజరయ్యారు. శ్రీదేవి, భర్త రాహుల్ తమ చిన్నారి రూపికతో కేక్ కట్ చేయించారు. సినీనటులు అర్జున్, ధనుష్, సిద్ధార్థ్, తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి. కాగా, నాటి నటి మంజుల, నటుడు విజయకుమార్ దంపతుల కుమార్తె శ్రీదేవి.

More Telugu News