nikhil: పాత్ర కోసం పది కిలోల బరువు పెరిగిన నిఖిల్

నిఖిల్ వైవిధ్యభరితమైన కథా చిత్రాలను అంగీకరిస్తూ .. వరుస సక్సెస్ లను నమోదు చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కన్నడలో హిట్ కొట్టిన 'కిర్రాక్ పార్టీ' సినిమాకి తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోని పాత్రకి తగిన విధంగా కనిపించడం కోసం ఆయన పది కిలోల బరువు పెరిగాడట.

 ఇందుకోసం యూకే వెళ్లి ఒక నెల రోజుల పాటు ట్రైనర్ పర్యవేక్షణలో శిక్షణ పొంది .. కండలు తిరిగిన శరీరంతో తిరిగొచ్చాడు. ఇంకా ఆ కసరత్తును కొనసాగిస్తూనే వున్నాడు. ఈ సినిమాలో కొత్త లుక్ తో ఆయన కనిపించనున్నాడన్న మాట. ఇక ఆ తరువాత తమిళ మూవీ 'కణిదన్' రీమేక్ లోను నటించనున్నాడు. ఆ నెక్స్ట్ మూవీగా 'కార్తికేయ' సీక్వెల్ వుంటుందట. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు.        

More Telugu News