: ట్రంప్ కు వ్యతిరేకంగా మరో కీలక తీర్పును వెలువరించిన ఫెడరల్ కోర్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కు ఫెడరల్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన ఆదేశాలకు కోర్టు కొన్ని సవరణలు చేసింది. ఈ దేశాలకు చెందిన ప్రజలెవరైనా సరే... వారి సన్నిహిత బంధువులు అమెరికాలో ఉంటే, వారు స్వేచ్ఛగా అమెరికాలో అడుగుపెట్టవచ్చని తీర్పును వెలువరించింది. అయితే, వారికి అమెరికాలో బంధువులు ఉన్నట్టు ధ్రువపత్రాలు చూపించాలని ఆదేశించింది. బంధువుల జాబితాలో... సోదరులు, అన్నదమ్ముల పిల్లలు, బావలు, వదినలు, మరదళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లను చేర్చారు. సిరియా, సూడాన్, లిబియా, ఇరాన్, సొమాలియా, యెమెన్ లపై ట్రంప్ ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.

More Telugu News