: విధ్వంసకర ఇన్నింగ్స్ తో పలు రికార్డులను సొంతం చేసుకున్న వెస్టిండీస్ బ్యాట్స్ మెన్

భారత్ తో జరిగిన ఏకైక టీ20లో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ ఎవిన్ లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 62 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విండీస్ చేతిలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తో లూయిస్ పలు రికార్డులను బద్దలు చేశాడు. అవేంటో చూడండి.

  • ఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన టీ20ల్లో ఇప్పటిదాకా రెండు సెంచరీలు చేసిన క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లంల సరసన లూయిస్ నిలిచాడు.
  • టీ20 మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టులో అత్యధిక పరుగులు చేసిన (125 పరుగులు) బ్యాట్స్ మెన్ గా లూయిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు ఈ రికార్డు హాంగ్ కాంగ్ కు చెందిన బాబర్ హయత్ (122) పేరిట ఉంది.
  • టీ20ల్లో టీమిండియాపై అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్ మెన్ గా లూయిస్ నిలిచాడు. ఇప్పటి దాకా ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ (124) పేరిట ఉంది.
  • టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ గా లూయిస్ అవతరించాడు. ఇప్పటి దాకా ఈ ఘనత క్రిస్ గేల్ (117) పేరిట ఉంది.
  • టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన మూడో బ్యాట్స్ మెన్ గా లూయిస్ అవతరించాడు. ఇతని కంటే ఎక్కువ స్కోరు సాధించిన ఆటగాళ్లు గ్లెన్ మాక్స్ వెల్ (145), ఆరోన్ ఫించ్ (156) మాత్రమే.
  • ఇండియాపై అత్యధిక సిక్సర్లు సాధించిన తన రికార్డును తానే బద్దలు కొట్టాడు లూయిస్. గత ఏడాది ఫ్లోరిడాలో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 9 సిక్సర్లు కొట్టిన లూయిస్... నిన్నటి మ్యాచ్ లో 12 సిక్సర్లు బాదాడు.
  • ఒకే దేశంపై టీ20ల్లో రెండు సెంచరీలు సాధించిన ఘనతను లూయిస్ సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ పై లూయిస్ సెంచరీ సాధించాడు.

More Telugu News