: విద్యార్ధులకు 'గూగుల్' ఆహ్వానం

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ ఓ సవాలుతో కూడిన ఆహ్వానాన్ని పలుకుతోంది. ప్రపంచాన్ని మార్చేయగలిగే ఆలోచనలతో కూడిన ప్రాజక్టులను విద్యార్ధుల నుంచి ఆహ్వానిస్తూ, 'గూగుల్ సైన్స్ ఫెయిర్ 2013'ను ఈ సంస్థ ప్రారంభించింది. ఈ పోటీలో అమెరికా నుంచి 30 మందిని, యూరప్, ఆఫ్రికాల నుంచి 30 మందిని, ఆసియా నుంచి 30 మందిని మొదటి స్థాయిలో ఎంపిక చేస్తారు. అనంతరం వీరి నుంచి 15 మందిని అంతిమంగా ఎంపిక చేసి, సత్కరిస్తారు.

సెప్టెంబర్ 23 వ తేదీన కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో విజేతలకు 50 వేల డాలర్లు బహుమతిగా అందజేస్తారు. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్ధులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలి. విద్యార్ధులు తమ ప్రాజక్టులను ఏప్రిల్ 30 లోగా సమర్పించాలి. ఇతర వివరాలకు గూగుల్ అధికారిక వెబ్ సైటు www.googlesciencefair.com సందర్శించవచ్చు. 

More Telugu News