: 'కామసూత్ర' పుస్తకాలను ఇక్కడ అమ్మవద్దు: భజరంగ్ సేన

మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఖజూరహో దేవాలయంలో కామసూత్ర పుస్తకాల అమ్మకాలను నిషేధించాలని భజరంగ్ సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఛతర్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్లీల చిత్రాలతో కూడిన ఈ పుస్తకాలను అమ్మడం వల్ల మన సంస్కృతికి చెడ్డపేరు వస్తోందని... మన దేశం పట్ల విదేశీయులలో చులకన భావం ఏర్పడుతోందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భజరంగ్ సేన అధ్యక్షుడు జ్యోతి అగర్వాల్ మాట్లాడుతూ, ఆలయంలో గోడల మీద ఉన్న శృంగార బొమ్మలతో ఖజూరహోకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంగతి వాస్తవమేనని... అయితే, పూర్వీకులు అప్పట్లో సంప్రదాయబద్ధంగా చెక్కిన బొమ్మలను ఇప్పుడు ప్రచారం చేయాలనుకోవడం సబబు కాదని చెప్పారు. ఇక్కడ శివాలయం కూడా ఉందని... ఇలాంటి చోట కామసూత్ర పుస్తకాలు అమ్మడం సరి కాదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నామని ప్రశ్నించారు.

More Telugu News