: గెలిచినా.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లీ!

ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 124 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ, ఈ విజయం కెప్టెన్ కోహ్లీకి ఆనందాన్ని ఇవ్వలేదు. ఫీల్డింగ్ లో పలు పొరపాట్లు జరిగాయని... ఫీల్డింగ్ విషయంలో 10 పాయింట్లకు గాను కేవలం 6 పాయింట్లు మాత్రమే ఇస్తున్నానని చెప్పాడు. కేవలం యువరాజ్ సింగ్ ఆటవల్లే పాక్ కంటే భారత్ మెరుగైన జట్టుగా నిలిచిందని కితాబిచ్చాడు.

 పాక్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన అజహర్ అలీ... ఫీల్డింగ్ తప్పిదాల వల్ల రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని చెప్పాడు. ఒకసారి హార్ధిక్ పాండ్యా నుంచి రనౌట్ మిస్ కాగా, మరోసారి భువనేశ్వర్ క్యాచ్ ను మిస్ చేశాడని గుర్తు చేశాడు. షాదబ్ ఖాన్ క్యాచ్ ను కేదార్ జాదవ్ వదిలేశాడని చెప్పాడు. ఇలాంటి తప్పిదాలు ఫీల్టింగ్ లో మరిన్ని కనిపించాయని అన్నాడు. బ్యాటింగ్ విషయంలో మాత్రం 10 మార్కులకు గాను 9 వేస్తానని చెప్పాడు. ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజారే అవకాశం ఉందని చెప్పాడు.

More Telugu News