: దిగివచ్చిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ.. సిలబస్ లో మహాత్మాగాంధీ పాఠ్యాంశం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన హిస్టరీ పేపర్ ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన జాతిపిత మహాత్మాగాంధీతో పాటు, అమెరికా నల్లజాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ లకు సంబంధించిందిన పాఠ్యాంశాలను రూపొందించనున్నారు. యూనివర్శిటీ తీసుకున్న నిర్ణయంతో... హిస్టరీ విద్యార్థులు బ్రిటన్ చరిత్రకు సంబంధించిన రెండు పేపర్లకు తోడు, దీన్ని కూడా చదవాల్సి ఉంటుంది. 'మేము చదువుతున్న పాఠ్యాంశాలు జాతి వివక్షతో ఎందుకున్నాయి?' అంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో... యూనివర్శిటీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News