: టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ అయితే బాగుంటుంది: హర్భజన్ సింగ్

టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ అయితే బాగుంటుందని భార‌త ఆట‌గాడు హర్భజన్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. టీమిండియా చీఫ్‌ కోచ్ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు బీసీసీఐని క‌లిసి ఒక ఫాస్ట్ బౌలింగ్ కోచ్ కావాలని కోరిన నేప‌థ్యంలో హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇలా స్పందించాడు. టీమిండియాలో యువ ఆట‌గాళ్లు ఉమేష్‌ యాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. వీరితో పాటు తాజాగా ముగిసిన ఐపిఎల్‌లో ప‌లువురు బౌల‌ర్లు ఆక‌ట్టుకున్నారు. టీమిండియా త‌ర‌ఫున ఆడ‌డానికి వీరంతా గ‌ట్టిపోటీనిస్తుండ‌డంతో వీరిలో ఎవ‌రిని ఎంచుకోవాల‌న్న అంశంపై సెల‌క్ష‌న్ క‌మిటీ త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతోంది.

More Telugu News