: ఇండోనేసియా వాసులను బెంబేలెత్తించిన 'సీ మాన్ స్టర్' కళేబరం

ఇండోనేసియా వాసులను 'సీ మాన్ స్టర్' కళేబరం హడలెత్తించింది. మూడు రోజుల క్రితం ఇండినేసియా ద్వీపాలలోని సెరం ద్వీపంలోని హులుంగ్‌ బీచ్‌ కు 15 మీటర్ల పొడవైన భారీ 'సీ మాన్ స్టర్' ఒకటి కొట్టుకొచ్చింది. దీనిని తొలుత అస్రుల్‌ అనే స్థానికుడు గుర్తించాడు. అనంతరం ద్వీపవాసులకు తెలుపగా... దానిని చూసిన వారంతా తొలుత అది పాడైపోయిన పడవ అని భావించారు. అయితే దాని దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూసి, బెంబేలెత్తిపోయారు.

అది పడవ కాదు... కుళ్లిపోయిన జంతు కళేబరం... దీంతో వెంటనే పోలీసులు, జూ అధికారులకు ఆ సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, జూ అధికారులు దానిని పరిశీలించి... అది 'హంప్‌ బ్యాక్‌' జాతికి చెందిన సొరచేప అని తెలిపారు. అది మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని తేల్చారు. ఈ జాతి చేపలు చాలా అరుదుగా ఉంటాయని వారు వెల్లడించారు. దీంతో వెంటనే ఆ బీచ్ ప్రాంగణాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పర్యాటకులు, స్థానికులు మాత్రం బీచ్‌ వద్ద గుమిగూడి కళేబరం వద్ద సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు.

More Telugu News