: ఇక ఐపీఎల్ వద్దు... తమ ఆటగాళ్లకు భారీ నజరానాల ఆశ చూపుతున్న ఆస్ట్రేలియా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో తమ దేశపు జాతీయ క్రికెట్ జట్టు ఆటగాళ్లు పాల్గొనకుండా చూడాలని సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా) తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. క్రికెటర్లు, సీఏ మధ్య ఇప్పటికే జీతాల వివాదం నడుస్తూ ఉండటంతో సీఈఓ ప్యాట్ హోవార్డ్ నుంచి ఓ ప్రతిపాదన వచ్చినట్టు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఒక సంవత్సరం కాంట్రాక్టులు ఇస్తుండగా, ఇకపై మూడేళ్ల కాంట్రాక్టులను ఇస్తామని ప్రతిపాదించారు.

ముఖ్యంగా టెస్టు జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, కీలక ఆటగాళ్లయిన వార్నర్, స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ తదితరులకు ఈ కొత్త రకం కాంట్రాక్టులను ఆయన ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆటగాళ్లకు భారీగా నగదు నజరానాలు ఇస్తే తప్ప వారిని భారత్ వైపు వెళ్లకుండా చూడలేమని భావిస్తున్న అధికారులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలావుండగా, ఐపీఎల్ కాంట్రాక్టుల్లో భాగంగా పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన ప్రసార ఒప్పందంతో వారికి లభించే మొత్తం మరింతగా పెరిగింది కూడా. ఈ నేపథ్యంలో, తమకు డబ్బులు కురిపిస్తున్న ఐపీఎల్ ను వదిలేందుకు ఎంతమంది సిద్ధమవుతారో వేచిచూడాలి!

More Telugu News