: లిబియా తీరంలో మునిగిన పడవలు... 200 మంది గల్లంతు...6 వేల మందిని రక్షించిన 'ఐరాస'

అంతర్యుద్ధం, ఉగ్రదాడులు, పొంచి ఉన్న యుద్ధం నేపథ్యంలో మధ్య ప్రాచ్యదేశాల ప్రజలు ఇళ్లు, ఊర్లు వదిలి సుదూరతీరాలకు సాగిపోతున్నారు. ఎలాగోలా బతికేందుకు ఉన్నవన్నీ వదిలి సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. ఆశల అలలపై ప్రయాణిస్తూ లిబియా సముద్ర తీరంలో రెండు పడవలు మునిగి సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది.

132 మంది వలస జీవులతో వెళ్తున్న ఒక పడవ మునిగి 80 మంది గల్లంతుకాగా, అటుగా వచ్చిన ఓ వాణిజ్య బోటు 52 మందిని రక్షించి సిలిసీలో తమను వదిలిందని ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డవారు తెలిపారు. మరో ఘటనలో 120 మందితో వెళ్తున్న పడవ మునిగి అందరూ గల్లంతు కాగా, 11 మంది మృతదేహాలు జవియా బీచ్‌ ఒడ్డుకు కొట్టుకొచ్చి విషాదం నింపాయి. కాగా, లిబియా తీరంలోని అంతర్జాతీయ జలాల్లో శుక్ర, శనివారాల్లో 6 వేల మంది వలసవాదులను రక్షించినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. వలస వాదులను రక్షించేందుకు ఈయూ, నాటో నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలిపాయి.

More Telugu News