: టర్మ్ డిపాజిట్లపై వడ్డీని తగ్గించిన ఎస్బీఐ

ఇప్పటికే పలు రకాల చార్జీల పేరట ఖాతాదారులను బాదేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మీడియం, లాంగ్ టర్మ్ డిపాజిట్లపై అర శాతం వరకూ వడ్డీ రేటును తగ్గిస్తున్నామని, కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల రెన్యువల్స్ పై ఈ తగ్గించిన వడ్డీ అమలవుతుందని బ్యాంకు పేర్కొంది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు సైతం అదే దారిలో పయనిస్తూ, సోమవారం నుంచి మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఎంసీఎల్ఆర్ ను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకూ, వ్యక్తిగత టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తక్కువ వడ్డీలకు రుణాలిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంకుల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

More Telugu News