: క్రిస్ గేల్ ను పక్కనబెట్టడం సబబే: వెటోరీ

ఐపీఎల్ 10లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో డాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ను పక్కన బెట్టడం, ఆపై మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో ఓడిపోవడంపై, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్న వేళ, ఆ జట్టు కోచ్ డేనియల్ వెటోరీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ ను పక్కన పెట్టడం సబబేనని, ఓ బౌలర్ తగ్గాడని భావించిన మీదటే అతన్ని తొలగించి, షేన్ వాట్సన్ ను తీసుకున్నామని అన్నాడు. ఇక పుణెతో మ్యాచ్ లో సైతం ఆయన్ను తీసివేయడాన్ని సమర్థించుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా, షేన్ వాట్సన్ ఈ సీజన్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. పుణెతో మ్యాచ్ లో 4 ఓవర్లలో 44 పరుగులను సమర్పించుకున్నాడు.

More Telugu News